ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ను నేరుగా ప్రస్తావించకుండానే, “మోసపూరిత జియోనిస్ట్ పాలన” అంటూ తీవ్రంగా విమర్శించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ జరిపిన చర్యలతో జియోనిస్ట్ పాలన పూర్తిగా నలిగిపోయిందని, అమెరికా కూడా అపార నష్టం ఎదుర్కొన్నదని ఆయన తెలిపారు.
ఇరాన్ ప్రజలకు ఈ విజయాన్ని అందించినందుకు అభినందనలు తెలుపుతూ ఖమేనీ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వరుసగా పోస్టులు చేశారు. ‘‘ఎన్ని ప్రకటనలు చేసినా, ఎంత గందరగోళం సృష్టించినా, జియోనిస్ట్ పాలన ఇస్లామిక్ రిపబ్లిక్ దెబ్బలకు నిలబడలేకపోయింది,’’ అని ఖమేనీ పేర్కొన్నారు.
అంతేకాదు, అమెరికా ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ‘‘జియోనిస్ట్ పాలన పూర్తిగా నాశనం అవుతుందని భావించి దానిని రక్షించేందుకు నేరుగా యుద్ధంలోకి దిగిన అమెరికా… తుదకు విఫలమైంది. ఇస్లామిక్ రిపబ్లిక్ అమెరికా చెంప చెళ్లుమనిపించింది’’ అని ఖమేనీ వ్యాఖ్యానించారు.
గల్ఫ్‌లో మోహరించిన అమెరికా దళాలపై ఇరాన్ ప్రతీకార దాడులను కూడా ఆయన గుర్తు చేశారు. ‘‘కీలకమైన అమెరికా వైమానిక స్థావరం అయిన అల్-ఉదీద్ పై దాడి చేసి నష్టం కలిగించాం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్లీ జరగవచ్చు’’ అంటూ హెచ్చరించారు. దురాక్రమణకు పాల్పడే శత్రువులకు ఇరాన్ తీవ్ర మూల్యం చూపిస్తుందని స్పష్టం చేశారు.
Read More : ట్రంప్ పూర్తి మద్దతు నెతన్యాహుకు

One thought on “ఇజ్రాయెల్‌పై ఖమేనీ వ్యాఖ్యలు.. అమెరికా చావుదెబ్బ తిన్నదా?”
Comments are closed.