తెలంగాణ జాగృతి తరపున ఉద్యమాలకు ఊపందిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అధికార కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తే ఆమె, ఇప్పుడు బీసీలు, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందంటూ సమాచార హక్కు చట్టం కమిషన్‌లో (RTI Commission) జరుగుతున్న నియామకాలపై ప్రశ్నలు లేవనెత్తారు. తాజాగా X (పూర్వం ట్విట్టర్) వేదికగా ఆమె స్పందిస్తూ, ఇప్పటి వరకు నియమించిన చీఫ్ కమిషనర్‌తో పాటు నలుగురు కమిషనర్లలో బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కరూ లేరని ఆరోపించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న మూడు పోస్టుల కోసం రూపొందించిన ప్రతిపాదనల్లో కూడా వీరికి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. “జనాభా శాతానికి అనుగుణంగా ఆ మూడింటిని బీసీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా? లేక మాటలు మాత్రమేనా? అనే అనుమానాలకు సమాధానంగా ఈ నియామకమే నిలుస్తుంది,” అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
ఈ అంశంపై ఆమె గళమెత్తడంతో ప్రభుత్వ నియామక విధానంపై విమర్శలు ముదురుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతగా ఉన్నప్పటికీ, తన స్వంత పార్టీ విషయంలోనూ గతంలో ఆమె పలుమార్లు బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీసీ, ఎస్టీ వర్గాలకు అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీ లోనూ సముచిత న్యాయం జరగాలన్న డిమాండ్‌తో కవిత మరోసారి పౌర హక్కులపై పోరాట బాట పడినట్టు కనిపిస్తోంది.

One thought on “సమాచార హక్కు కమిషన్‌లో బీసీలకు, ఎస్టీలకు చోటు లేదా?”
Comments are closed.