ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా, భారాస కలసికట్టుగా పనిచేశాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఫలితాలపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అభ్యర్థిని పెట్టకుండా భారాస భాజపాతో కుమ్మకై కాంగ్రెస్‌ను ఓడించిందని విమర్శించారు.
“కేటీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిద్దరూ ఎవరికి ఓటేశారో చెప్పాలి. తక్కువ ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమిపై సమీక్ష జరుపుతాం” అని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే అంశంపై స్పందిస్తూ, “కాంగ్రెస్‌ను ఓడించేందుకు భాజపా, భారాస కలిసి పనిచేశాయి. పట్టభద్రుల నైపుణ్య అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు” అని పేర్కొన్నారు.

One thought on “ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-భారతీయ రాష్ట్ర సమితి కుమ్మక్కు.. కాంగ్రెస్‌పై కుట్ర: మంత్రి పొన్నం ప్రభాకర్”
Comments are closed.