అదిలాబాద్‌లో అమానుష ఘటన

అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలో మానవత్వం మరిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో స్నేహం పేరుతో 16 ఏళ్ల మైనర్ బాలుడు అదే వయస్సున్న బాలికను మాయ మాటలతో దగ్గరయ్యాడు. అనంతరం ఆమెను బెదిరించి నగ్నంగా వీడియో కాల్ చేయించుకున్నాడు.

వాటిని రికార్డు చేసి తన స్నేహితులకు షేర్ చేసిన ఈ బాలుడు, కొంతకాలంగా బాలికను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్టు సమాచారం. బాలిక తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు మైనర్లతో పాటు వంశీకృష్ణ (20), పవర్ తరుణ్ (18), గుండల్వార్ వరుణ్ (18), కారడ్ సుధీర్ (28), ముర్కుటే విఠల్ (23), సాబ్లే బాలవంత్ సింగ్ (18) అనే మొత్తం 8 మందిపై పీడోఫిలియా, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు ఈ కేసును తీవ్రంగా తీసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలికలపై జరుగుతున్న ఈవిధమైన ఆన్‌లైన్ నేరాలపై తల్లిదండ్రులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Read More : గుజరాత్‌లో భారీ వర్షాలు

One thought on “అదిలాబాద్‌లో అమానుష ఘటన

Comments are closed.