నంబాల కేశవరావు మృతి నిరసనగా ఎలర్ట్‌లో ఏవోబీ

ప్రముఖ మావోయిస్టు నేత నంబాల కేశవరావు (అలియాస్ బసవరాజు) మృతికి నిరసనగా మావోయిస్టులు ఈరోజు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ వారు ఈ బంద్‌కు పిలుపునివ్వగా, ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ విధించారు. ముఖ్యంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

ఈ నేపథ్యంలో రేపటి నుండి ఆగస్టు 3వ తేదీ వరకు నంబాల కేశవరావు స్మరణార్థంగా మావోయిస్టులు దేశవ్యాప్తంగా స్మారక సభలను నిర్వహించనున్నారు. ఈ కాలంలో శాంతి భద్రతలు కొనసాగించే క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

ఏవోబీ ప్రాంతాల్లో అధికారులు నిఘా పెంచారు. బంద్‌ నేపథ్యంలో రాష్ట్రం పలు sensitive ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Read More : హనీమూన్ మర్డర్ కేసులో మరో మలుపు

One thought on “నంబాల కేశవరావు మృతి నిరసనగా ఎలర్ట్‌లో ఏవోబీ

Comments are closed.