రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన కమల్ హాసన్

మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గురించి తెలియని వారుండరు. ఇవాళ (శుక్రవారం) కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళంలో ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. అంతకుముందు పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణం చేయనున్నందుకు తానెంతో గర్వపడుతున్నానన్నారు.

కమల్ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. విపక్ష ఇండియా కూటమిలో ఇది భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 39 లోక్ సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్ఎం ప్రచారం చేసింది. 2025 ఎంఎన్ఎంకు రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది.

2024 లోక్ సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువసభ స్థానం కేటాయించారు. దీంతో కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని డీఎంకే-ఎంఎన్ఎం కొద్దిరోజుల కిందటే ఖరారు చేశాయి. ఆ తర్వాత కమల్ ఎన్నిక ఏకగ్రీవమైంది.

Read More : ఘజియాబాద్‌లో డెలివరీ వేషంలో నగల దుకాణం దోపిడి