టాలీవుడ్ నటుడు మంచు విష్ణు మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలిలోని సోమిశెట్టి మధుసూధన్ రావు కుటుంబాన్ని విష్ణు దత్తత తీసుకున్నాడు. అతని భార్య, ఇద్దరు పిల్లల్ని కలిసి పరామర్శించి, పిల్లల చదువు సహా అన్ని అవసరాలను భాద్యతగా తీసుకుంటానని హామీ ఇచ్చాడు.
ఈ ఉదాత్త నిర్ణయానికి నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. విష్ణు నడిచిన మానవత్వ మార్గం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో ‘‘దేవుడు మీకు మంచి చేయాలనీ కోరుకుంటున్నాం’’ అంటూ అనేక మంది స్పందిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, మంచు విష్ణు నటించిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం కన్నప్ప త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 27న విడుదల కానున్న ఈ చిత్రానికి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మించారు.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. కన్నప్ప విష్ణు కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

One thought on “పహల్గామ్ బాధితుల కుటుంబానికి అండగా మంచు విష్ణు”
Comments are closed.