నా వస్తువులు ఇవ్వండి – మోహన్‌బాబు ఇంటి వద్ద మంచు మనోజ్ నిరసన

Manchu Manoj protest at Mohan Babu house

మంచు మ‌నోజ్‌ కుటుంబ కలహాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన కారు పోయిందని పోలీసులను ఆశ్రయించిన మ‌నోజ్‌, త‌న అన్న మంచు విష్ణుపై నేరుగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం జల్‌పల్లి లోని మోహన్‌బాబు నివాసం వద్దకు చేరుకుని, లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయట బైఠాయించి నిరసన తెలియజేశారు.

మీడియాతో మాట్లాడిన మ‌నోజ్‌, తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంట్లో తన పెంపుడు జంతువులు, వ్యక్తిగత వస్తువులు ఉన్నాయని, వాటిని తీసుకోవడానికే వచ్చానని చెప్పారు. త‌న‌కు ఆస్తిపై ఆసక్తి లేదని తండ్రికి ఎప్పుడో చెప్పానని తెలిపారు. ఇదంతా విద్యార్థుల కోసం అని, అప్పటినుంచి గొడవలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

పాప పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్ వెళ్లిన తరవాత విష్ణు తన ప్లాన్ అమలు చేశారని, తెల్లవారుజామున కార్లను తీసుకెళ్లడం, సెక్యూరిటీపై దాడి చేశారంటూ మ‌నోజ్ ఆరోపించారు. బైండోవర్ ఉల్లంఘనలు, పోలీసుల నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు నోటీసులతో వచ్చినా ఇంటిలోకి అనుమతించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన మ‌నోజ్, తన సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Read More