కేజీఎఫ్ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తర్వాత తెరకెక్కించిన ‘సలార్’తో ఆ స్థాయి స్పందన అందుకోలేకపోయాడు. దీంతో సినీ ప్రేక్షకుల చూపు ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుపై నిలిచింది. ఫిబ్రవరి 20న హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ సినిమాకు శుభారంభం చేశారు. “న్యూ వేవ్ ఆఫ్ యాక్షన్ అండ్ యుఫోరియా” అంటూ విడుదలైన BTS ఫోటో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. వలసవాదుల నేపథ్యంతో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన డార్క్ థీమ్ ఫాంటసీ టచ్‌లో రూపొందుతుంది.
ఈ సినిమాను ప్రకటించిన దశనుంచి ఎన్టీఆర్ రగ్గడ్ లుక్‌ను రిలీజ్ చేస్తూ మేకర్స్ అంచనాలు పెంచారు. ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందన్న టాక్ బలంగా వినిపిస్తుండగా, ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబో ఖచ్చితంగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని అభిమానుల్లో నమ్మకం ఉంది. ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా, అదే పేరుతో ఇప్పటికే ఓ సినిమా రావడం వల్ల టైటిల్‌పై ఇంకా స్పష్టత రాలేదు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దేవర’ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో, ఈ సినిమాతో ఏలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టాలన్న పట్టుదల మేకర్స్‌కి ఉంది. ఈ బుధవారం (ఏప్రిల్ 9) ఎన్టీఆర్ లుక్ బయటకొస్తుందా? లేక సినిమా విడుదల తేదీపై ప్రకటన ఉంటుందా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతికి కాకుండా ఏప్రిల్ 9, 2026న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్నది ఇండస్ట్రీ టాక్.

One thought on “ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్.. హిస్టరీ క్రియేట్ చేస్తారా?”
Comments are closed.