డిజైనర్ లుక్‌లో మతిపోగొడుతున్న మలైకా అరోరా

Malaika Arora Designer Look

బికినీలు, స్విమ్‌సూట్లు, జిమ్‌వేర్… ఏదైనా దుస్తులు గ్లామర్‌గా మలచడం మలైకా అరోరాకు కొత్తేమీ కాదు. చీరకట్టులోనూ సొగసును చాటి చెలరేగే ఈ అందాల రాణి తాజాగా వైట్ అండ్ గోల్డ్ లెహంగాలో నెటిజన్ల గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రముఖ డిజైనర్ సురిలీ గోయెల్ రూపొందించిన ఈ లెహంగాలో మలైకా పోజులు పిచ్చెక్కించాయి.

ఫోటోషూట్‌లో బ్యాక్‌గ్రౌండ్ పెయింటింగ్ ప్రత్యేకంగా హైలైట్ అవ్వడం విశేషం. 51 ఏళ్ల మలైకా స్టైలింగ్‌ను సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆస్తా శర్మ అందించారు. ఈ ఖరీదైన డిజైనర్ లెహంగా తొమ్మిది అడుగుల పొడవుతో అందరినీ ఆకట్టుకుంటోంది. చురిదార్ స్లీవ్స్ ఐవరీ బ్లౌజ్‌తో బంగారు రంగు పూల ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ప్లంగింగ్ V-నెక్‌లైన్ ద్వారా మలైకా అందాలను అద్భుతంగా ఎలివేట్ చేశారు.

లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఎత్నిక్ గోల్డ్ చోకర్ నెక్లెస్, స్టేట్మెంట్ రౌండ్ చెవిపోగులు, తెల్లటి ముత్యాల పూసలను జోడించి మత్తెక్కించే చూపులతో మలైకా మైమరిపించింది.

ఏజ్‌లెస్ బ్యూటీగా పేరుగాంచిన మలైకా అరోరా ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి సారిస్తోంది. రియాలిటీ షోలు, ఫ్యాషన్ షోలతో పాటు సోషల్ మీడియా ప్రచారాలతో భారీగా ఆర్జిస్తోంది. అర్జున్ కపూర్‌తో విడిపోవడంతో ఇప్పుడు పూర్తిగా ఒంటరి జీవితం గడుపుతూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. సోషల్ మీడియాలో మలైకా లుక్ తెగ వైరల్ అవుతోంది. స్టన్నింగ్ అండ్ సొఫిస్టికేటెడ్ స్టైల్‌తో ఫ్యాషన్‌ వరల్డ్‌కి మరోసారి ఫుల్ స్టాప్ పెట్టింది మలైకా!

Read More

One thought on “డిజైనర్ లుక్‌లో మతిపోగొడుతున్న మలైకా అరోరా

Comments are closed.