‘రెయిడ్ 2’ టీజర్: అజయ్ దేవగణ్ vs రితేష్ దేశ్‌ముఖ్ పవర్‌ఫుల్ క్లాష్!

Raid 2 Movie Teaser

అజయ్ దేవగణ్‌ హీరోగా 2018లో వచ్చిన రెయిడ్ చిత్రం మంచి విజయం సాధించింది. నిజాయితీ కలిగిన ఐఆర్‌ఎస్ ఆఫీసర్ పాత్రలో అజయ్ దేవగణ్ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా రెయిడ్ 2 రాబోతోంది. శుక్రవారం విడుదలైన టీజర్‌తో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఆసక్తి నెలకొంది.

ఈ సారి అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) ఎదుర్కొనే ఛాలెంజ్ చిన్న అవినీతి కాదు, రాజకీయ నేత దాదాభాయ్ (రితేష్ దేశ్‌ముఖ్) రూపంలో ఉంది. టీజర్‌లో అమయ్ తన సర్వీసులో 74 రైడ్స్ చేసి, 74 సార్లు ట్రాన్స్‌ఫర్ అయినట్టు చూపించారు. మొదటి భాగంలో విలన్‌గా కనిపించిన సౌరభ్ శుక్లా ఈసారి జైలులో నుంచే కథను నెరేట్ చేస్తూ కనిపించాడు. రితేష్ దేశ్‌ముఖ్ స్టైలిష్ రాజకీయ నాయకుడిగా, అజయ్‌తో మాటల యుద్ధం చేస్తూ హైలైట్‌గా నిలిచాడు.

రెయిడ్ 2 మే 1న విడుదల కానుంది. టీజర్ చూసిన తెలుగు ప్రేక్షకులకు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమా కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల విఫలమైంది. అయితే, బాలీవుడ్‌లో కథను సహజంగా కొనసాగించడం, రితేష్ దేశ్‌ముఖ్‌ వంటి నటుడిని విలన్‌గా చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read More



One thought on “‘రెయిడ్ 2’ టీజర్: అజయ్ దేవగణ్ vs రితేష్ దేశ్‌ముఖ్ పవర్‌ఫుల్ క్లాష్!

Comments are closed.