అచ్చం తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల, ఇప్పుడు శోభిత అక్కినేనిగా పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించింది. నటనపై ఆసక్తితో ముంబై వెళ్లి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో విజయవంతంగా కొనసాగింది.
‘రామం రాఘవం’ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన శోభిత, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంతో తెలుగులో గుర్తింపు పొందింది. ఆ తరువాత పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది.
తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యను గత ఏడాది వివాహం చేసుకున్న శోభిత, వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో తన జుట్టుకు సంబంధించి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. “నా హెయిర్ మొత్తాన్ని కత్తిరించాలా?” అంటూ ఫాలోవర్స్‌ను ఆశ్చర్యపరిచింది.
వారి అభిప్రాయాల కోసం పోల్ నిర్వహించిన శోభిత, బోల్డ్ సమ్మర్ మేకోవర్‌కు సిద్ధమవుతుందా లేక కొత్త హెయిర్ స్టైల్‌తో సర్‌ప్రైజ్ ఇస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతమంది సోషల్ మీడియాలో ఇది ప్రచార స్టంట్ లేదా సినిమా కమిట్‌మెంట్ కోసం చేసే ఫస్ట్‌లుక్ గేమ్ అయ్యుండవచ్చని అభిప్రాయపడ్డారు.
ఏదేమైనా, శోభిత కొత్త లుక్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఫ్యాషన్, స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు నూతన ప్రమాణాలను సెట్ చేసే ఆమె ఈ సారి కూడా అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వడం ఖాయం.

One thought on “శోభిత అక్కినేని బోల్డ్ మేకోవర్.. సర్‌ప్రైజ్ ఏంటి?”
Comments are closed.