ఎన్టీఆర్ జిల్లాలో విషాదం

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి (35) అనే మహిళ, ఉపాధి హామీ పనులకు వెళ్లిన సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజతో వాగ్వాదం జరిగింది. ఈ తతంగంలో అతడు తనను అందరి ముందూ అమర్యాదగా అవమానించాడని బాధపడిన మాధురి, ఆత్మహత్యకు పాల్పడింది.

ఆవేదనతో సెల్ఫీ వీడియో తీసిన మాధురి, ‘‘ఒసేయ్ అని మాట్లాడతావా? కమ్మ పుట్టుక అని నన్ను కించపరిచావా? నన్ను అవమానించావు. ఇది తట్టుకోలేకపోతున్నా,’’ అంటూ కన్నీటి పర్యంతమై పురుగుమందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.

తన మృతికి ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజే కారణమని వీడియోలో స్పష్టంగా పేర్కొంది. తనకు జరిగిన అన్యాయాన్ని టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీరియస్‌గా తీసుకుని, మహిళలను అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : ఓ తల్లి పసికందును హత్య చేసిన హృదయ విదారక ఘటన.