రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం, ఇద్దరు అరెస్ట్.

మహారాష్ట్రలోని మాల్వనీ ప్రాంతంలో మానవత్వం తలదించుకునే ఘోర ఘటన వెలుగుచూసింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న 19 ఏళ్ల యువకుడు ఆమె రెండున్నరేళ్ల కుమార్తెపై హత్యాచారానికి పాల్పడి, పాపను మరణించేవరకు హింసించిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

30 ఏళ్ల మహిళ భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ సమయంలో ఆమె ఓ 19 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవల అతడు ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో, కన్న కూతురిపై లైంగిక దాడి చేశాడు. ఈ దృశ్యాన్ని తల్లి చూసినా అడ్డుకోకుండా అతడికి సహకరించిందన్నది విచారణలో బయటపడింది.

లైంగిక దాడిలో చిన్నారి అపస్మారక స్థితికి చేరడంతో, తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తరువాత నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో చిన్నారి శరీరంపై, ముఖ్యంగా ప్రైవేట్ భాగాలపై గాయాల గుర్తులు కనిపించాయి.

పాప మృతిపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, విచారణలో తల్లి నిజాన్ని ఒప్పుకుంది. తల్లి ప్రియుడు బాలికపై హత్యాచారం చేసినట్టు తేలింది. పోలీసులు వారిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారుల భద్రతపై సమాజం సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Read More : కేంద్రం మూడు కీలక అంశాలకు పరిమితి కోరింది

One thought on “రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం, ఇద్దరు అరెస్ట్.

Comments are closed.