కుబేర సినిమా చూస్తుండగా కూలిన సీలింగ్

మహబూబాబాద్ జిల్లాలోని ముకుంద థియేటర్ వద్ద నిన్న రాత్రి విషాదం సంభవించింది. కుబేర సినిమా సెకండ్ షో ప్రదర్శన జరుగుతుండగా, హాల్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడం వల్ల ప్రేక్షకులపై పడింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సీలింగ్ కూలిన వెంటనే థియేటర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భయభ్రాంతులకు లోనైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి ఘటనను తీసుకెళ్లిన వారు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. థియేటర్ నిర్మాణంలో లోపాలున్నాయా? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Read More : అశ్లీల వీడియోల స్ట్రీమింగ్‌ దంపతుల అరెస్ట్

One thought on “కుబేర సినిమా చూస్తుండగా కూలిన సీలింగ్

Comments are closed.