బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని మీడియా సంస్థలు మరియు జర్నలిస్టుల వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై మరియు పార్టీ నాయకత్వంపై ఉద్దేశపూర్వకంగా నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. గత కొన్ని నెలలుగా కొందరు జర్నలిస్టుల ముసుగులో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. “ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాను ఏమాత్రం ఖాతరు చేయను. కానీ నా కుటుంబం, మిత్రులు, పార్టీ సహచరులు మానసికంగా బాధపడుతున్నారు. అందుకే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ దాడుల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తనకు తెలుసని, అవసరమైతే వారినీ బహిర్గతం చేసి తగిన ప్రతిస్పందన ఇస్తానని ఆయన హెచ్చరించారు.
మహా న్యూస్ కార్యాలయంపై దాడికి కేటీఆర్ స్పందన
మహా న్యూస్ చానల్ కార్యాలయంపై జరిగిన దాడిపై కూడా కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు అనవసరం అని పేర్కొంటూ, అలా వ్యవహరించడాన్ని తాను సమర్థించనని తెలిపారు. సమస్యలు ఉంటే చట్టపరమైన మార్గంలోనే పరిష్కరించాలన్నది తన స్పష్టమైన అభిప్రాయమని ఆయన వివరించారు.
Read More : పోలీసులపై దాడి, చివరకు మెంటల్ ఆస్పత్రికి తరలింపు

One thought on “మీడియా వ్యవహారశైలి పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం”
Comments are closed.