మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి: నివాళులర్పించిన సీఎం

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఈరోజు ఉదయం సెక్రటేరియట్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీ.హెచ్., అంజన్ కుమార్ యాదవ్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.

Read More : ఇంటర్నెట్ కేబుళ్ల తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం