రాహుల్ గాంధీ యాత్రలో అపశ్రుతి

బీహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఈ రోజు ఉదయం ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. నవాడా జిల్లాలో జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ జీపు అనుకోకుండా ఒక పోలీస్ కానిస్టేబుల్ పాదాలపైకి ఎక్కింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జనసందోహం మధ్య వాహనం నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనం కింద చిక్కుకున్న కానిస్టేబుల్‌ను ఇతర పోలీసులు, స్థానికులు వెంటనే రక్షించారు. గాయపడిన కానిస్టేబుల్ కుంటుకుంటూ పక్కకు వెళ్లగా, రాహుల్ గాంధీ వెంటనే స్పందించి తన వలంటీర్లను సహాయం చేయమని ఆదేశించారు. అంతేకాకుండా స్వయంగా వాటర్ బాటిల్ అందించి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ వాహనం కానిస్టేబుల్‌ను “నలిపివేసిందని” ఆరోపిస్తూ, దీనిని “క్రష్ జనతా యాత్ర”గా అభివర్ణించింది. బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా “వారసుడు వాహనం దిగీ కానిస్టేబుల్‌ను సరిగా చూసుకోలేదు” అని విమర్శించారు.

Read More : ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు

One thought on “రాహుల్ గాంధీ యాత్రలో అపశ్రుతి

Comments are closed.