ఉట్నూరు ఎఫ్‌ఐఆర్ కొట్టేసిన న్యాయస్థానం

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆయన విమర్శించారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్‌పై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు ఉట్నూరు పోలీసులు.

ఈ కేసు విచారణను చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్, ఇరుపక్షాల వాదనలు విని ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ తీర్పు ప్రకటించారు.

Read More : వైద్య ఆరోగ్య శాఖలో భారీ అవినీతి.. ఉద్యోగ నియామకాలలో అక్రమాలు వెలుగు