రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి, అక్రమాల ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలోని వైద్య శాఖలో నోటిఫికేషన్లేమీ లేకుండానే అనేక ఉద్యోగ నియామకాలు జరగినట్లు ఆరోపణలు వెల్లడి అయ్యాయి.
ఎమ్మెల్యేల రికమండేషన్‌లు, అధికారుల ఒత్తిళ్లతో అర్హతలు లేని అభ్యర్థులను ఉద్యోగాలకు నియమించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ అనుమతులు లేకుండానే కొందరికి జీతాలు కూడా విడుదలైనట్లు సమాచారం.
ప్రత్యేకంగా నారాయణపేట జిల్లాలో ఈ అక్రమాలు ఎక్కువగా నమోదయ్యాయి. మలేరియా నివారణ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి భార్యను RBSK కింద డాక్టర్‌గా నియమించినట్లు సమాచారం. ఇదే జిల్లాలో కోస్గికి చెందిన ఓ యువకుడిని ఫార్మాసిస్టుగా నియమించగా, అతడికి సంబంధిత అర్హతలు లేవని ఆరోపణలు వస్తున్నాయి.
ఊట్కూరుకు చెందిన BHMS విద్యార్థిని, మల్టీ పర్పస్ హెల్త్ ప్రొవైడర్ (MLHP)గా ప్రమోట్ చేయాలని ఓ ఎమ్మెల్యే లేఖ ఇచ్చినట్లు తెలిసింది. అదే లేఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులో ఉన్న మరో వ్యక్తిని జిల్లా కమ్యూనిటీ మోబిలైజర్‌గా నియమించేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం.
2024 డిసెంబర్‌లో మరికల్ PHCలో పని చేస్తున్న ఓ మహిళను NHM కింద స్టాఫ్ నర్సుగా నియమించగా, అక్టోబర్‌లో కృష్ణా PHCకి ఆయుష్ ఫార్మాసిస్టుగా నియమితుడైన వ్యక్తి, వాస్తవానికి ఫార్మాసిస్టే కాకపోవడం గమనార్హం.
కోటకొండ PHCలో ఓ యువకుడు, కోస్గిలో ఓ యువతి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తూ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే నియామకానికి గురైనట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
అలాగే, ఊట్కూరు PHCలో పనిచేస్తున్న ఓ మహిళ వైద్య పరీక్షల నిమిత్తం రెండు నెలలు సెలవులో ఉన్నా, ఆమెకు జీతం చెల్లించినట్లు సమాచారం. ఈమె భర్త కలెక్టరేట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడన్న సాకుతో వేతనం విడుదలైనట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారాలపై అధికారులతో పాటు ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించాల్సిన అవసరం ఉందని పౌర సమాఖ్యలు డిమాండ్ చేస్తున్నాయి.
Read More : సిద్దిపేటలో హరీశ్ రావు కీలక ప్రకటన …

2 thoughts on “వైద్య ఆరోగ్య శాఖలో భారీ అవినీతి.. ఉద్యోగ నియామకాలలో అక్రమాలు వెలుగు”
Comments are closed.