KTR Congress Government తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఎక్స్ (X – Social Media) వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పాత దృశ్యాలు కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పాడి రైతు (Dairy Farmer) కష్టాల్లో ఉన్నాడని, బ్యాంక్ లోన్ (Bank Loan) చెల్లించలేదని ఏకంగా ఆ ఇంటి గేటును (House Gate) బ్యాంక్ సిబ్బంది తీసుకెళ్లారని కేటీఆర్ మండిపడ్డారు. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ (Loan Waiver) చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ CM Revanth Reddy తన మాట నిలబెట్టుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. రుణం కట్టలేదని రైతుపై బ్యాంక్ ప్రతాపం చూపిస్తే, రుణమాఫీ చేయని సీఎంపై ప్రజలు చర్య తీసుకోవాలా? అని ఆయన వ్యాఖ్యానించారు.
Bank Actions – Farmers’ Grievances
Jangaon జిల్లా Kodakandla మండలం ఏడునూతుల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ DCCB – District Cooperative Central Bank ద్వారా రైతులు పాడిగేదెల కోసం రుణం తీసుకున్నారు. అయితే కొన్ని వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి లీగల్ నోటీసులు (Legal Notices) ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రైతులు కొన్ని లక్షలు చెల్లించినా బ్యాంక్ వారు వారి ఇంటి గేట్లు తీసుకెళ్లారని రైతులు ఆరోపించారు. కానీ వారు స్వయంగా గేట్లు తీసుకెళ్లమని చెప్పారని DCCB Branch Manager కళ్యాణి తెలిపారు.
కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పేద రైతులకు ఒక న్యాయం, అధికారంలో ఉన్నవారికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రైతులు ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోరని, కాంగ్రెస్ నేతలను తమ గేటు దాటి వెళ్లనీయరని హెచ్చరించారు.
Our you tube channel click here

One thought on “రుణం కట్టలేదని ఇంటి గేటు తీసుకెళ్లారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!”
Comments are closed.