తెలంగాణ రాజకీయాల్లో అధికార బీఆర్‌ఎస్ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “రేవంత్‌కి నిజంగా ధైర్యం ఉంటే మేడిగడ్డ బ్యారేజీపై బహిరంగ చర్చకు రావాలి. చర్చకు రావమంటే పారిపోయారు. చర్చకు పిలిచి దొరకకుండా వెళ్లిపోయిన పిరికివాడి తత్వం ఇది,” అని ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్ కట్ట మీద కూడా చర్చకు రావాలని మరోసారి సవాలు విసిరారు. “తెలివిలేని వ్యక్తి కాళేశ్వరాన్ని ‘కులేశ్వరం’ అంటున్నాడు. కేసీఆర్ తుంగతుర్తి చివరి మడిదాకా నిలిచిన నాయకుడు” అని అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి పదవిలో ఉండి రంకెలు వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే ‘ఏం చేస్తారో చేసుకోండి, నన్ను కోసుకుని తింటారా?’ అనే తీరును ప్రజలు త్వరలోనే చూడబోతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆయన తీరుకు తగిన సమాధానం ఇస్తారు,” అని అన్నారు.
రాజకీయాల్లో తిట్ల వాడకాన్ని తాము ఇష్టపడకపోయినా, రేవంత్‌కు ఆయన భాషలోనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం వస్తోందన్నారు. “రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు, రేవంత్ లాంటి దొంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదు. లేకపోతే రీకాల్ చేసే పద్ధతిని కూడా రాజ్యాంగంలో ప్రవేశపెట్టేవారు,” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
One thought on “రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు”
Comments are closed.