తెలంగాణలో రాబోయే ప్రభుత్వం బీఆర్‌ఎస్ (BRS)దేనని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు, కేటీఆర్‌ను కలసి, ముషీరాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు మరియు ప్రజాసమస్యలను తెలియజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాబోయే జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజలను చైతన్యవంతులుగా మారించి, బీఆర్‌ఎస్ కు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఆయన, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కూడా సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రజని కాంత్ గౌడ్, ముప్పిడి నర్సింగ్‌రావు, నాగేష్ పాల్గొన్నారు.
Read More : హైదరాబాద్‌లో చెన్నై యువతిపై లైంగిక దాడి..

One thought on “BRS ప్రభుత్వమే రాబోతున్నదని కేటీఆర్ స్పష్టం.”
Comments are closed.