బస్సులో యువతిపై లైంగిక వేధింపులు

కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో ప్రయాణిస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సులో నిద్రిస్తున్న ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ బస్సులో పనిచేస్తున్న కండక్టర్, ఆమె పక్కనే నిలబడి పలుమార్లు ఆమెను అనుచితంగా టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ దారుణ చర్యను గమనించిన మరో ప్రయాణికుడు తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

దీంతో స్పందించిన కేఎస్ఆర్టీసీ అధికారులు ఆ కండక్టర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇటువంటి అకృత్యాలకు తావు లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Read More : పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్

One thought on “బస్సులో యువతిపై లైంగిక వేధింపులు

Comments are closed.