వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కి చేరిన తొలి భారత మహిళ

భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ మరోసారి దేశాన్ని గర్వించనిచ్చే ఘనత సాధించారు. ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కి చేరిన తొలి భారత మహిళగా చరిత్రలో నిలిచారు. ఆమె ఈ విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన, “మన తెలుగు కుమార్తె హంపీ ప్రపంచ వేదికపై తన ప్రతిభతో మెరిసింది. ఆమె సాధించిన ఘనత దేశాన్ని గర్వించేట్లా చేసింది. చెస్ బోర్డుపై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా” అన్నారు.

అలాగే, మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, “కోనేరు హంపీ విజయం భారత చెస్కు చారిత్రక మైలురాయి. సెమీఫైనల్స్‌కి చేరడం ద్వారా ఆమె నైపుణ్యం, ఓర్పు, వ్యూహాత్మక చాతుర్యాన్ని మరోసారి నిరూపించారు. ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు, దేశం మొత్తానికి గర్వకారణం. టైటిల్‌ను కూడా గెలిచి మరింత రాణించాలని ఆశిస్తున్నా” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Read More : శ్రీశాంత్ కూతురు మాటలకు కన్నీటి పర్యంతమైన హర్భజన్ సింగ్

One thought on “వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కి చేరిన తొలి భారత మహిళ

Comments are closed.