అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
రాత్రి సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయనను పోలీసులు రిమాండ్‌లో ఉంచారు. ఈ ఉదయం వైద్య పరీక్షల కోసం ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు పూర్తి చేశారు.
ప్రస్తుతం తుళ్లూరు పోలీసులు ఆయనను మంగళగిరి కోర్టుకు హాజరు పరచడానికి తీసుకెళ్తున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, కోర్టు విచారణపై ప్రజలు, మీడియా వర్గాలు గమనిస్తున్నాయి.
Read More : వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ

One thought on “కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తి”
Comments are closed.