కేరళకు చెందిన 59 ఏళ్ల వసంతి చెరువీట్టిల్ (Vasanthi Cheruveettil) తన పట్టుదలతో Everest Base Camp ను ఒక్కరే చేరుకున్నారు. ప్రత్యేకమైన శిక్షణ లేకుండానే ఈ సాహసయాత్రను పూర్తి చేయడం విశేషం. కేవలం YouTube వీడియోల ద్వారా ట్రెక్కింగ్‌కు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకొని, హిందీ భాషపై పట్టుసాధించడమే కాకుండా, ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
ఫిబ్రవరి 15, 2025న నేపాల్‌లోని సుర్కే (Surke) గ్రామం నుంచి ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఎత్తైన పర్వత ప్రాంతాల ఒడిదుడుకులను అధిగమిస్తూ, ఫిబ్రవరి 23, 2025న Everest Base Camp ను విజయవంతంగా చేరుకున్నారు. ఇది ఆమెకు మాత్రమే కాకుండా, సాధారణ మహిళలు కూడా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలరని నిరూపించే ప్రేరణాత్మక ఘటనగా నిలిచింది.
Read More : ఛత్తీస్‌గఢ్‌లో గర్భిణీ ఆదివాసీ మహిళపై దారుణం…

One thought on “ఎవెరెస్ట్ బేస్ క్యాంప్‌ను ఒక్కరే అధిరోహించిన 59 ఏళ్ల కేరళ మహిళ”
Comments are closed.