కేసీఆర్, కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కుదేలై మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారని చామల విమర్శించారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత దోచుకుంటామని కలలుగన్న కేసీఆర్ కుటుంబం ఆలోచనలను ప్రజలు ముందే గ్రహించి వారిని ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చామల మాట్లాడారు.
కేదార్ అనే వ్యక్తి దుబాయిలో డ్రగ్స్ కారణంగా చనిపోయినట్లు తేలింది. ఆయనకు కేటీఆర్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దుబాయిలో కేదార్ తో పెట్టుబడులు పెట్టించిందెవరు? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముంది? గతంలో పదేళ్లు చర్చ లేకుండా అసెంబ్లీ నడిపారు. గతంలో జీవోలపై మంత్రులకే తెలియకుండా చేశారు. పైపెచ్చు ఇప్పుడు రచ్చ, చర్చ అని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ ఇరురాష్ట్రాల సీఎంలను ఢిల్లీకి పిలిపించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై నెలకొన్న సమస్యలపై చర్చించేందుకే వారిని రప్పించినట్లు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. దానిని పక్కన పెట్టి బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్స్ పెట్టి ఊదరగొట్టారు. ఇలా చేయడం ఏ మాత్రం సరికాదని చామల పేర్కొన్నారు.
Read More : Hyderabad : రహదారులు జలమయం, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

One thought on “గతంలో పదేళ్లు చర్చ లేకుండా అసెంబ్లీ నడిపిన బీఆర్ఎస్”
Comments are closed.