తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఎర్రవెల్లి నివాసంలో పార్టీ ప్రధాన నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇటీవల సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది.
ఈ పరిణామంపై బీఆర్ఎస్ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ “సత్యమేవ జయతే” అంటూ ట్వీట్ చేసింది. అలాగే, తెలంగాణలో ఉపఎన్నికలు అనివార్యం అవుతున్నాయని పేర్కొంది.
తదుపరి వ్యూహంపై కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ లో అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Read More : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
