తమిళ నటుడు ఎస్. శ్రీనివాసన్ భారీ మోసం కేసులో అరెస్ట్ అయ్యారు. రూ.1,000 కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి ఒక సంస్థ నుంచి రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆయనను చెన్నైలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, 2010లో ఒక సంస్థకు పెద్ద రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన శ్రీనివాసన్, బదులుగా రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. నెలలోపే రుణం రాకపోతే డబ్బులు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చినా, రుణం మంజూరు కాలేదు. అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బును వ్యక్తిగత అవసరాలు, సినిమా నిర్మాణాల కోసం ఉపయోగించినట్లు సమాచారం. మోసపోయామని గుర్తించిన సంస్థ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించడంతో ఈ అరెస్ట్ జరిగింది.
శ్రీనివాసన్ 2010లో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇప్పటివరకు 60కు పైగా చిత్రాల్లో నటించారు. 2011లో వచ్చిన లథిక చిత్రంలో హీరోగా నటించగా, నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు. సినిమాలతో పాటు చెన్నైలో ఓ ఫైనాన్స్ సంస్థను స్థాపించి, అదే పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
అంతేకాదు, తమిళనాడులో తనను తాను “పవర్ స్టార్” అని పిలుచుకుంటూ శ్రీనివాసన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
Read More : ‘కింగ్‌డమ్’పై విజయ్ దేవరకొండ స్పందన

2 thoughts on “రూ.1000 కోట్ల మోసం కేసులో తమిళ నటుడు అరెస్ట్”
Comments are closed.