కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన తుది నివేదికను సమర్పించింది. బరాజ్‌ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంపై విస్తృతంగా విచారణ జరిపిన కమిషన్, మొత్తం 115 మందిని విచారించి సాక్ష్యాలను సేకరించింది. విచారణ అనంతరం తుది నివేదికను సిద్ధం చేసి తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Read More : మద్యం మత్తులో పూజలు చేసిన అర్చకుడు తొలగింపు

One thought on “ప్రభుత్వానికి విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్”
Comments are closed.