తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అరెస్టును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీ ప్రధాన నేత కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ అవినీతిని, మంత్రుల అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ అరెస్టులు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. “తప్పు చేసినవారికి రక్షణ కల్పించి, ప్రశ్నించే నేతలపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలపై అవాస్తవ కేసులు నమోదు చేయడం దుర్మార్గం” అని అన్నారు.
ఇలాంటి అక్రమ కేసులు న్యాయస్థానాల్లో నిలవవని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. “ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు చేయడం భావ్యం కాదు. ఈ తీరు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోంది” అని వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి అరెస్టు ప్రభుత్వ కక్షసాధింపుల భాగమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More : గచ్చిబౌలి యోగా వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్,

2 thoughts on “కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్, హరీష్ రావు తీవ్ర విమర్శలు”
Comments are closed.