అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులు, శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా విశాఖలో జరిగిన కార్యక్రమాల తీరుపై సమగ్రంగా చర్చించారు.
యోగా దినోత్సవం ఇంత ఘన విజయం సాధించడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సహకారం, ప్రభుత్వ శాఖల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ వల్లే ఈ స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు. ఇది ప్రజల మద్దతుతో సాధించిన గొప్ప ముందడుగు అని అభిప్రాయపడ్డారు.ఈ విజయంలో ముఖ్యంగా మంత్రులు, శాసన సభ్యులు, ప్రభుత్వ అధికారులు పోషించిన పాత్రను సీఎం ప్రశంసించారు. కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారి బాధ్యతాయుత వ్యవహారం ప్రశంసనీయమని కొనియాడారు. విశాఖలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి అర్థరాత్రి నుంచే ప్రజలు భారీగా తరలిరావడం విశేషంగా భావిస్తున్నట్లు తెలిపారు.మూడు లక్షల మందికి పైగా ప్రజలు యోగా సాధనలో పాల్గొనడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఈసారి ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత హాజరు లెక్కింపు విధానం విజయవంతమైందని, దీనివల్ల కార్యక్రమంలో పాల్గొన్న వారి ఖచ్చితమైన లెక్కలు పొందగలిగామని మంత్రులు వివరించారు.
Read More : యోగా ప్రాచుర్యంలో మోదీ ఘనతపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

One thought on “ఆంధ్రాలో యోగా దినోత్సవ విజయంపై సీఎం సమీక్ష”
Comments are closed.