ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర బృందం ప్రత్యేక కానుకగా ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ చిత్రానికి సంబంధించి ఓ శక్తివంతమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌తో పాటు, చిత్ర విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో రిషబ్ శెట్టి వీరుడిగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. గతంలో వచ్చిన ఫస్ట్ లుక్‌లో ఆయన ముఖం పూర్తిగా కనిపించకపోయినా, ఈసారి విడుదలైన పోస్టర్‌లో పవర్‌ఫుల్ అవతారంతో ఆయన మెరిశారు. ఇది సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తోంది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ ప్రీక్వెల్‌ను కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీత దర్శకుడు అజనీశ్ లోక్‌నాథ్ ఈ సినిమాకు మళ్ళీ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ఈ పోస్టర్ విడుదలతో చిత్రంపై విపరీతమైన హైప్ ఏర్పడింది. ప్రేక్షకులు అక్టోబర్ 2వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More : రియల్ ఎస్టేట్ వివాదంలో మహేశ్ బాబు పేరు

One thought on “రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘కాంతార”
Comments are closed.