ఐసీఐసీఐ బ్యాంకు రుణం అంశంపై కేటీఆర్ వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందన

కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టంగా తెలిపారు.

ఈ భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినవో లేదా అటవీ శాఖకు చెందినవో కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఈ భూములపై రుణం మంజూరు చేయలేదని, ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చామల విమర్శించారు.

టీజీఐఐసీ ఫేస్ వాల్యూ ఆధారంగా 27 కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయని, ఆ సంస్థలకు అందిన నిధులు ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా టీజీఐఐసీ ఖాతాలో జమయ్యాయని వివరించారు. కేటీఆర్ నోటికి వచ్చినట్లు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇక తమ ప్రభుత్వంపై బురద జల్లే రాజకీయ దుయ్యరికం బీఆర్ఎస్ చేపడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పేద ప్రజలు సన్న బియ్యం అన్నం తింటూ సంతృప్తిగా జీవిస్తున్న ఈ సమయంలో, ఈ విషయం చూసి ఓర్చుకోలేక బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : గ్రూప్-1 ఫలితాల వివాదం : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం నోటీసులు!

One thought on “ఐసీఐసీఐ బ్యాంకు రుణం అంశంపై కేటీఆర్ వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందన

Comments are closed.