నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అర్జున్ S/o వైజయంతి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా, కథానాయికగా సయీ మంజ్రేకర్ కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో, చిత్రబృందం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. హీరో కల్యాణ్ రామ్, విజయశాంతి తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చిత్ర యూనిట్‌కు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా టీం తిరుమల పర్యటన చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా విడుదలకు సంబంధించి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
Read More : పెద్దవారితో రొమాన్స్ బాగుంటుంది: అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!

One thought on “కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రత్యేక పూజలు”
Comments are closed.