థ్రిల్లర్ సినిమాతో మమ్ముట్టి రీ ఎంట్రీ

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘బజూకా’ ఈ రోజు థియేటర్లలో విడుదల కానుంది. డీనో డెనిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే బాబు ఆంటోనీ, నీతా పిళ్ళై, గాయత్రి అయ్యర్, జగదీష్, సిద్ధార్థ్ భారతన్, ఇశ్వర్యా మీనన్, అబిన్ బినో తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సైద్ అబ్బాస్ సంగీతం అందించగా, నిమిష్ రవి మరియు రోబీ వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నిషాద్ యూసుఫ్, ప్రవీణ్ ప్రభాకర్ కలిసి ఎడిటింగ్ పనులు నిర్వహించారు.

Read More : కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రత్యేక పూజలు

One thought on “థ్రిల్లర్ సినిమాతో మమ్ముట్టి రీ ఎంట్రీ

Comments are closed.