అగ్రహీరో మేనల్లుడు తిరిగి రీఎంట్రీకి రెడీ!

Imran Khan comeback movie

మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్, “జానే తు యా జానే నా”, “ఐ హేట్ లవ్ స్టోరీస్” వంటి రొమాంటిక్ కామెడీలతో యువతరం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తన సింపుల్ లుక్, ఎమోషనల్ ప్రేమకథల ఎంపికతో స్పెషల్ ప్లేస్ సంపాదించాడు.

అయితే వరుస ఫెయిల్యూర్స్, భార్య అవంతికతో విభేదాలు, వ్యక్తిగత సమస్యలు కలిసి ఇమ్రాన్‌ను సినిమాలకు దూరం చేశాయి. దాదాపు దశాబ్ధం తర్వాత, మళ్లీ నటనలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. “బ్రేక్ కే బాద్” ఫేమ్ డానిష్ అస్లామ్ డైరెక్షన్‌లో రూపొందనున్న కొత్త రొమాంటిక్ డ్రామాకి ఓకే చెప్పాడు.

ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై కసరత్తులు చేస్తూ, పూర్తిగా కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతూ తనను తిరిగి తయారు చేసుకుంటున్న ఇమ్రాన్, ఇటీవల లీకైన ఫోటోలతో ఫిట్ అవతార్‌ను ఫ్లాంట్ చేశాడు.

ఇక మళ్లీ రొమాంటిక్ కామెడీకి తగ్గ కథలో తిరిగి స్క్రీన్ మీద మెరవాలని భావిస్తున్నాడు. మంచి లవ్, ఎమోషన్, మ్యూజిక్ ఉంటే, ఇమ్రాన్ ఖాన్‌కు మళ్లీ సక్సెస్ సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ప్రజలు ఆయనను మళ్లీ ముద్దుగా ఆదరించారా? అన్నదీ వేచి చూడాలి.

Read More


One thought on “అగ్రహీరో మేనల్లుడు తిరిగి రీఎంట్రీకి రెడీ!

Comments are closed.