మంచిరేవుల వద్ద చిక్కిన చిరుత

ఎట్టకేలకు అధికారులను 20 రోజులుగా ముప్పుతిప్పలు పెట్టిన చిరుత బోనులో చిక్కింది. మంచిరేవుల ఈకో ట్రెక్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోనులో ఈ చిరుతను పట్టుకున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. వారాల తరబడి ఈ చిరుతను గుర్తించేందుకు అటవీ సిబ్బంది పెద్ద ఎత్తున శ్రమించారు. చివరికి జాగ్రత్తగా వేసిన ఉచ్చులో ఇది చిక్కింది. అయితే, జూపార్కుకు తరలించే సమయంలో కెమెరాలతో ఎగబడ్డ ప్రజలను చూసి చిరుత ఆగ్రహంగా గాండ్రించింది.

ప్రస్తుతం ఈ చిరుతను సురక్షితంగా జూపార్కుకు తరలించే చర్యలు అధికారులు చేపట్టారు. ఈ సంఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read More : మద్యం మత్తులో పూజలు చేసిన అర్చకుడు తొలగింపు