వైఎస్సార్‌సీపీ నేత కాకాణికి 14 రోజుల రిమాండ్

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాకాణిపై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకం, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి కేసులతో పాటు, ఈ అక్రమాల్ని అడ్డుకోవాలనుకున్న గిరిజనులను బెదిరించారన్న ఆరోపణలూ ఉన్నాయి. పోలీసుల ప్రకారం, ఈ కేసులో ఆయనను ‘ఏ4 నిందితుడిగా’ పేర్కొన్నారు.

బెంగళూరులో ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ నెల్లూరు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం నుంచి వెంకటగిరి కోర్టుకు తీసుకొచ్చారు. తొమ్మిది పోలీసు వాహనాల కాన్వాయ్‌తో, భారీ బందోబస్తు నడుమ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కాకాణికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆయనను జైలుకు తరలించనున్నారు.

Read More : “మోదీ ఓట్లకంటే దేశాభివృద్ధికే ప్రాధాన్యం”

One thought on “వైఎస్సార్‌సీపీ నేత కాకాణికి 14 రోజుల రిమాండ్

Comments are closed.