భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నత వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ తాజ్ కృష్ణాలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
తాను ఇండియా కూటమి అభ్యర్థి కాదని, ప్రతిపక్షాల అభ్యర్థినని సుదర్శన్ రెడ్డి స్పష్టంచేశారు. ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం స్వీకరించనని చెప్పారు. తనపై వచ్చే విమర్శలపై తాను వెనుకడుగు వేయనని, ఉప రాష్ట్రపతి ఎన్నికల పోటీలో నుంచి తప్పుకోవనని ఆయన ప్రకటించారు. “నాపై విమర్శలు చేస్తున్న వారు నేను ఇచ్చిన తీర్పులు చదవాలి. అవి నా వ్యక్తిగత తీర్పులు కాదు, కోర్టు తీర్పులు. 11 మంది న్యాయమూర్తులు వాటిని పరిశీలించారు. ఒక్క అంశాన్నీ మార్చలేకపోయారు” అని గుర్తు చేశారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- రాజ్యాంగ వ్యవస్థలు మసకబారుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది.
- ఓటు వేసే ప్రతి పౌరుడికి రాజకీయ అభిప్రాయం ఉంటుంది.
- ప్రతి ఎన్నికలో పాల్గొని నా ఓటు హక్కు వినియోగించుకున్నాను.
- పౌరహక్కులు, సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుతాను.
- ఉప రాష్ట్రపతి పదవి రాజకీయపరమైనది కాదని స్పష్టం చేస్తున్నాను.
- నేను ఐదుసార్లు రాజ్యాంగంపై ప్రమాణం చేశాను. దాన్ని కాపాడటం నా బాధ్యత.
- ఈ దేశ ప్రజలు ముందుగా ఓటర్లు, తరువాతే పౌరులు అయ్యారు.
- ఓటర్ల జాబితా చిత్తు కాగితం కాదని గుర్తు పెట్టుకోవాలి.
- మెజారిటీ ఉందని చట్టాలు మార్చడం రాజ్యాంగ విరుద్ధం.
- రాజ్యాంగం మంచి నాయకుల చేతుల్లో ఉన్నంతవరకే రక్షణ పొందుతుంది.
సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు ఉప రాష్ట్రపతి ఎన్నికల హీట్‌ను మరింత పెంచాయి.
Read More : ఉక్రెయిన్ సంక్షోభంపై మోదీ స్పష్టమైన సందేశం.

One thought on “ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా స్పష్టమైన సందేశం.”
Comments are closed.