తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33ను సమర్థిస్తూ, వరుసగా 9, 10, 11, 12 తరగతులు తెలంగాణలో చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న నిబంధనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ జీవోను సవాల్ చేస్తూ కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ప్రతి రాష్ట్రానికి స్థానిక రిజర్వేషన్ల నిబంధనలు నిర్ణయించుకునే అధికారం ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదించగా, ఆ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఫలితంగా విద్యార్థుల పిటిషన్‌ను సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కొట్టివేసింది.
ఈ లోకల్ కోటా రిజర్వేషన్ ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు వర్తించనుంది. అయితే, గత ఏడాది ఇచ్చిన మినహాయింపులతో ప్రయోజనం పొందిన విద్యార్థులు అలాగే కొనసాగాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read More : తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.

One thought on “తెలంగాణలో లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.”
Comments are closed.