సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం అధికారికంగా పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించగా, దేశ న్యాయవ్యవస్థలో ఆయనకు ఉన్న గౌరవాన్ని చాటింది.
వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఖన్నా, విలేకరులతో మాట్లాడుతూ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. పదవీ విరమణ అనంతరం తాను ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టనని స్పష్టం చేస్తూ, “ఇదే నా స్పష్టమైన నిర్ణయం” అని వెల్లడించారు. సీజేఐలుగా లేదా న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన తరువాత కొంతమంది ప్రభుత్వ పదవులు చేపట్టడం దేశవ్యాప్తంగా విమర్శలకు లోనవుతున్న నేపథ్యంలో ఖన్నా ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అదేవిధంగా న్యాయ రంగంలో పెరిగిపోతున్న అసత్య ధోరణిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని సూచించారు. న్యాయరంగంలో తన సేవలు కొనసాగిస్తానని, న్యాయవాదిగా మరియు న్యాయమూర్తిగా తన ఇన్నింగ్స్‌లు ముగిశాయని, ఇక మూడో ఇన్నింగ్స్‌లో న్యాయవ్యవస్థకు సహకరించే విధంగా కొనసాగుతానని వెల్లడించారు.
వీడ్కోలు కార్యక్రమంలో తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టబోయే జస్టిస్ బీఆర్ గవాయ్, ఇతర న్యాయమూర్తులు, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తదితరులు పాల్గొని జస్టిస్ ఖన్నా సేవలను కొనియాడారు.
2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, 2023 నవంబర్ 11న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి న్యాయవ్యవస్థ పటిష్టతకు కృషి చేశారు.
Read More : ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం.

2 thoughts on “ప్రభుత్వ పదవులకు నో చెప్పిన తీర్పు”
Comments are closed.