టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా వీరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరోసారి గుర్తు చేసే ఓ ఎమోషనల్ మోమెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుకుమార్ భార్య తబిత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అందులో తారక్, సుకుమార్ భుజంపై ప్రేమగా వాలి రిలాక్స్ అవుతున్నట్టు కనిపించారు.
ఈ ఫోటోకు తబిత “తారక్‌కు ప్రేమతో” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆపై ఎన్టీఆర్ కూడా అదే ఫోటోను రీ-పోస్ట్ చేస్తూ, “నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్” అంటూ సుకుమార్‌ను ట్యాగ్ చేశారు. తారక్ ఇచ్చిన క్యాప్షన్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని డైలాగ్ కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్యూట్ మోమెంట్‌పై నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో స్పందిస్తున్నారు. వీరి మధ్య ఉన్న దోస్తీ నిజంగా మనసుని తాకుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్–సుకుమార్ కాంబినేషన్‌లో చివరిసారిగా 2016లో వచ్చిన నాన్నకు ప్రేమతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబో మళ్లీ రిపీట్ కాలేదు. ప్రస్తుతం తారక్ ‘వార్ 2’లో నటిస్తుండగా, ప్రశాంత్ నీల్‌తో ఓ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. మరోవైపు, సుకుమార్ ‘పుష్ప 2’ అనంతరం రామ్ చరణ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తారక్–సుకుమార్ మళ్లీ కలవాలన్నది అభిమానుల ఆకాంక్షగా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ ఫోటో, ఆ కాంబోపై మళ్లీ చర్చలు తెరపైకి తెచ్చింది.

One thought on ““నన్ను వెంటాడే ఎమోషన్” – తారక్–సుక్కు బాండింగ్ ఫోటో వైరల్!”
Comments are closed.