తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి, ప్రస్తుతం తమిళ సినిమాల్లో దూసుకుపోతూ అక్కడ పెద్ద అవకాశాలు సొంతం చేసుకుంటోంది. అయితే, ఆమె సోషల్ మీడియాలో కూడా బాగా ఆక్టివ్‌గా ఉంటూ తరచూ తన స్టైలిష్ లుక్స్, గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా, అంజలి తన కొత్త ఫోటోషూట్ చిత్రాలను షేర్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి. ట్రెండీ ఔట్‌ఫిట్, డీసెంట్ హెయిర్‌స్టైల్, ఆకట్టుకునే మేకోవర్‌తో అంజలి ఇచ్చిన పోజులు, ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన అంజలి, ఇప్పుడు స్లిమ్‌గా, మరింత ఆకర్షణీయంగా మారింది. గ్లామర్ షో చేయకుండా కూడా ఎలా ఆకట్టుకోవాలో అంజలి నిరూపిస్తోంది.
కెరీర్ పరంగా చూస్తే, అంజలి ఇటీవలి కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు, గీతాంజలి వంటి హర్రర్ సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న అంజలి, మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేస్తుందన్న నమ్మకం అభిమానుల్లో పెరుగుతోంది.

One thought on “స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన అంజలి – గ్లామర్ పిక్స్ వైరల్!”
Comments are closed.