ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన టెస్టు కెరీర్‌లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఆయన 13,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఇప్పటివరకు రూట్ 153 టెస్టులాడగా, వాటిలో మొత్తం 13,000 పరుగులు చేశాడు. ఆయన బ్యాటింగ్ సగటు 50.98గా ఉంది.
ఇటీవలి దాకా 36 శతకాలు నమోదు చేసిన రూట్, అత్యధికంగా ఒక ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేశారు. ఈ ఘనతతో రూట్ టెస్టు క్రికెట్ చరిత్రలో 5వ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు ఆయన కళ్లెదురుగా రికీ పాంటింగ్, జాక్వస్ కాలిస్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజుల రికార్డులు ఉన్నాయి.
జో రూట్ బ్యాటింగ్‌లో కనిపిస్తున్న ఆకలి చూస్తే… త్వరలోనే మరిన్ని మైలురాళ్లు చేరుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More : ప్రీతి జింటా చట్టపరమైన చర్యలు

One thought on “జో రూట్ అద్భుత మైల్స్టోన్ …”
Comments are closed.