ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింటా తన జట్టు యాజమాన్య సంస్థలోని ఇతర డైరెక్టర్లపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. పంజాబ్ కింగ్స్ యాజమాన్య సంస్థ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ సహ డైరెక్టర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలపై ఆమె చండీగఢ్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 21న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం (EGM) చట్టపరమైన అనుమతులు లేకుండా నిర్వహించబడి, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రీతి సవాలు చేశారు.
ఆ సమావేశంలో మునీష్ ఖన్నాను కొత్త డైరెక్టర్‌గా నియమించగా, ప్రీతి జింటా దాని నిర్వహణలో కంపెనీల చట్టం 2013, ఇతర నిబంధనలు పాటించలేదని అభియోగాలు వేసింది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం ఏప్రిల్ 10న ఈమెయిల్ ద్వారా అందినప్పటికీ, ఆమె అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోయారని పేర్కొంది.
వివాదాస్పద సమావేశానికి ప్రీతి జింటా, మరో డైరెక్టర్ కరణ్ పాల్ హాజరై మునీష్ ఖన్నా నియామకానికి వ్యతిరేకంగా నిలిచినప్పటికీ, మోహిత్ బర్మన్, నెస్ వాడియా మద్దతుతో సమావేశం కొనసాగించి, ఖన్నా నియామకం ఆమోదించబడింది.
ఈ నేపథ్యంలో, ప్రీతి జింటా కోర్టులో ఏప్రిల్ 21న జరిగిన ఈ సమావేశాన్ని మరియు అందులో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని, మునీష్ ఖన్నాను డైరెక్టర్‌గా వ్యవహరించకుండా నిరోధించాలని, ఈ కేసు పరిష్కారమయ్యే వరకు మునీష్ ఖన్నా ప్రమేయం లేకుండా కంపెనీ ఎలాంటి బోర్డు లేదా సర్వసభ్య సమావేశాలు జరగకుండా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కేసు ఐపీఎల్ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది.
Read More : బెన్ కటింగ్ సంచలన వ్యాఖ్యలు

One thought on “ప్రీతి జింటా చట్టపరమైన చర్యలు”
Comments are closed.