కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అసంతృప్తిపై ప్రముఖ నేత జీవన్ రెడ్డి స్పందించారు. తనకు పార్టీపై అసంతృప్తి ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి — ‘‘కాంగ్రెస్ పార్టీపై నాకు అసంతృప్తి ఉన్న మాట నిజమే. నా స్థాయిలోని, నా అనుభవం ఉన్న సీనియర్ నాయకుడికి తగిన ప్రాధాన్యం, సరైన అవకాశాలు లేకపోతే అసంతృప్తి రావడం సహజమే’’ అని వ్యాఖ్యానించారు.
అదే సందర్భంలో, ‘‘వి.హనుమంతరావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ నాయకుడిని. కానీ ఇప్పటికీ నాకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం బాధగా ఉంది’’ అని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read More : CM రేవంత్ రెడ్డి లిఫ్ట్ ప్రమాదం నుంచి క్షేమం — నోవాటెల్‌లో ఉద్రిక్తత వాతావరణం
