అన్నమయ్య జిల్లాలో దేశానికి సేవలందిస్తున్న పారా మిలిటరీ జవాన్ భూమిని కొంతమంది కబ్జా చేసిన ఘటన కలకలం రేపుతోంది. రామసముద్రం మండలంలోని చిట్టెంవారి పల్లి గ్రామానికి చెందిన జవాన్ మోహన్ కుటుంబానికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి.
చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే వ్యక్తులు — మోహన్ కుటుంబ భూమితో పాటు మరొక 45 మంది రైతుల భూములు, ప్రభుత్వ భూమిని కూడా అక్రమంగా ఆక్రమించారని సమాచారం. దీనిపై పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. తహసీల్దార్ సైతం కబ్జాదారుల పక్షాన మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భూమికి సంబంధించి అన్ని పత్రాలు పూర్తిగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం, కేసు హైకోర్టులో ఉన్నప్పటికీ కబ్జాదారులు భూమిపై పెత్తనం కొనసాగించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్ మోహన్ సోదరుడు దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
“దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతున్న జవాన్‌కు ఈ స్థాయి అన్యాయం జరుగుతుంటే, ఎవరు స్పందించాలి?” అంటూ ఆయన ట్విట్టర్‌లో
చంద్రబాబు , పవన్కళ్యాణ్ , నారాలోకేష్ లకు ట్యాగ్ చేస్తూ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
జవాన్‌కి న్యాయం జరిగేలా అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read More : భారత్–పాక్ ఉద్రిక్తతల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్..

2 thoughts on “అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు”
Comments are closed.