వివాదాల్ని దాటి విజయపథంలో జానీ.. కూతురు బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా!

Jani Master daughter's birthday celebration

టాలీవుడ్ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల తన కూతురు అలియా పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన జాట్ సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో ఈ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది.

పుట్టిన రోజు పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వేడుకకు హీరోయిన్ రెజీనా, నటుడు రణ్ దీప్ హుడా, రవిశంకర్, దర్శకుడు గోపిచంద్ మలినేని తదితరులు హాజరై, జానీ మాస్టర్ కుమార్తెకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఒక్కచోట చేరిన ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జానీ మాస్టర్ ఈ సందర్భాన్ని తన కెరీర్‌లో మళ్లీ శుభారంభంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం లైంగిక వేధింపుల ఆరోపణలపై జైలుకు వెళ్లొచ్చిన జానీ మాస్టర్, ప్రస్తుతం రామ్ చరణ్‌ “గేమ్ ఛేంజర్”, అక్షయ్ కుమార్‌ “స్కై ఫోర్స్” వంటి భారీ చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు.

ఇప్పుడిప్పుడే మళ్లీ సినీ పరిశ్రమలో తన స్థానాన్ని బలపర్చుకుంటూ పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతున్నారు. వ్యక్తిగతంగా కూడా కుమార్తె పుట్టిన రోజు వేడుకలతో కుటుంబానికి ఆనందాన్ని పంచారు.

Read More


One thought on “వివాదాల్ని దాటి విజయపథంలో జానీ.. కూతురు బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా!

Comments are closed.